VAYUPUTRA: ‘మహావతార్’ హిట్ ఫార్ములానే నమ్ముకుని.. నాగవంశీ ‘వాయుపుత్ర’.. డైరెక్టర్ ఎవరంటే?

VAYUPUTRA: ‘మహావతార్’ హిట్ ఫార్ములానే నమ్ముకుని.. నాగవంశీ ‘వాయుపుత్ర’.. డైరెక్టర్ ఎవరంటే?

యానిమేషన్ ప్రాజెక్టుల సందడి టాలీవుడ్లో మొదలైంది. ఇవాళ (సెప్టెంబర్ 10న) సితార నిర్మాణ సంస్థ యానిమేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటుగా టైటిల్ వెల్లడించింది. ‘వాయుపుత్ర’ అనే టైటిల్తో వస్తున్న ఈ యానిమేషన్ మూవీని, చందు మొండేటి తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది.

‘‘వాయుపుత్ర కేవలం సినిమా కాదు, పవిత్ర దృశ్యం. మన చరిత్ర యొక్క ఆత్మ నుండి, మన ఇతిహాసాల పేజీల నుండి, ఒక అమర పురాణం కథ జీవం పోసుకుంటుంది.  ఈ అద్భుతమైన ఇతిహాసాన్ని సినిమా థియేటర్లలో 3D యానిమేషన్‌లో చూసి థ్రిల్ అవ్వండి. 2026 దసరా సందర్భంగా  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం & కన్నడ భాషల్లో మీ ముందుకు రానుందని ’’సితార సంస్థ వెల్లడించింది. 

ఈ 3D యానిమేషన్‌ 2026 దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం & కన్నడలో విడుదల కానుంది. గతంలో చందు మొండేటి మైథాలజీ బ్యాక్ డ్రాప్లో 'కార్తికేయ2'తో భారీ విజయం సాధించారు. ఈ క్రమంలో వాయుపుత్ర సబ్జెక్టుకి చందు అయితేనే న్యాయం చేస్తాడని నిర్మాత నాగవంశీ భావించినట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే.. ఒకప్పుడు యానిమేషన్ మూవీస్.. తెలుగులో ఒకటి రెండు సినిమాలొచ్చిన సంగతి తెలిసిందే.అయితే, అవి పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. ఇపుడు అలా కాదు.. టెక్నాలజీ పెరిగింది. హీరోలు, హీరోయిన్‌లు అసలు అవసరం లేదు. పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఏ మాత్రం అవసరంలే. ఒక స్టార్ హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే తక్కువ బడ్జెట్ లోనే మంచి యానిమేషన్ తీసే రోజులొచ్చాయి.

ఇటీవల, ఈ విషయాన్ని.. సరిగ్గా నిరూపించిన చిత్రమే.. మహావతార్ నరసింహ. ఈ యానిమేషన్ మూవీ కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర రూ.300కోట్లకి పైగా గ్రాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ వాయుపుత్రతో వస్తున్నారు. మరి ఎలాంటి విజయం దక్కించుకుంటాడో చూడాలి!