
తెలంగాణలో ప్రభుత్వ పాలన అంతా అయోమయంగా ఉందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అధికారులు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదన్నారు. ఏ శాఖకు ఫోన్ చేసినా ఫోన్ కలవదని.. కాళేశ్వరం నుంచి ఓక్క ఎకరాకు నీళ్లు రాలేదన్నారు. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం నుంచి నీళ్ళ దోపిడీ చేస్తుంటే..కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వరదలతో హైదరాబాద్ మునుగుతుంటె..కేసీఆర్ ఫాంమౌస్ లో విశ్రాంతి తీసుకుంటారని..నిరుద్యోగ బృతికి అతీ గతి లేదన్నారు. దళితులకు ఇచ్చే మూడెకరాల భూమి ఊసేలేదని.. ధరణితో రాష్ట్రం గందరగోళంలో పడిందన్నారు.
తనకు కావాల్సిన వారికోసం రెవెన్యూ వ్యవస్థను గంధరగోళం చేశారని.. వ్యవసాయ రంగం అంతలాకుతలం అవుతున్నా…పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. సన్నవడ్లు పండిచిన రైతుల బాధలు కేసీఆర్ కు పట్టవా అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకపోవడం రైతులకు అది మరింత భారంగా మారిందని..వరద సాయం ఏమైందన్నారు. ఏంధుకు మళ్ళీ ఎన్నికల తర్వాత ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.