చింతమడక స్కీంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి: భట్టి

చింతమడక స్కీంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి: భట్టి

చింతమడక గ్రామం లోని ప్రతీ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. అసెంబ్లీ హల్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం లో ఉన్న ప్రతీ కుటుంబానికి.. చింతమడకకు ఇచ్చినట్టు… 10 లక్షల రూపాయలను ఇవ్వాలని ఎద్దేవాచేశారు.. అయితే దీని పేరును ‘చింతమడక స్కీం’ అని పేరుపెట్టాలని కోరారు భట్టి. సీఎం కేసీఆర్ తన సొమ్మును పంచడం లేదని, అవి ఆయన సొంత ధనం కావని.. రాష్ట్ర ప్రజలందరిదీ కాబట్టి నగదును కూడా అందరికీ పంచాలని అన్నారు.

కేసీఆర్ కాళేశ్వరం ను ఎడిటర్ లకు చూపిస్తాను అని చెప్పడం మంచి నిర్ణయమే అని అన్నారు భట్టి విక్రమార్క. కాళేశ్వరం పేరు మీద అప్పులను, DPR (డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) లను కూడా ఎడిటర్ లకు అందించాలని చెప్పారు.

శాసన సభలో తాను కాళేశ్వరం DPRని ప్రతీ ఎమ్మెల్యేకు ఇవ్వాలని అడిగానని..  ఇందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు DPR ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికైనా DPRను ఎమ్మెల్యేలకందరికీ అందించాలని తెలిపారు. గతంలో ఉన్న సీఎం లు రోడ్లు, నీళ్ల ట్యాంక్ లు ,రోడ్ లు ,స్కూల్ లు ప్రజలకు ఇచ్చేవారని.. ఇలా ఎప్పుడూ కూడా కుటుంబానికి 10 లక్షల నగదును ఎవరు ఇవ్వలేదని చెప్పారు.