పీయూష్ గోయల్తో భట్టి విక్రమార్క భేటీ..గ్లోబల్ సమిట్కు రావాలని ఆహ్వానం

పీయూష్ గోయల్తో భట్టి విక్రమార్క భేటీ..గ్లోబల్ సమిట్కు రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్​లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​కు హాజరుకావాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్​ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. పార్లమెంట్​లో కేంద్ర మంత్రిని ఆయన కలిశారు.

 సమిట్​లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రికి డిప్యూటీ సీఎం వివరించారు. డిప్యూటీ సీఎం వెంట ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ,  సురేశ్​ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.