సైబరాబాద్, రాచకొండ వెబ్‌‌‌‌సైట్లు హ్యాక్‌‌‌‌!

 సైబరాబాద్, రాచకొండ వెబ్‌‌‌‌సైట్లు హ్యాక్‌‌‌‌!

హైదరాబాద్, వెలుగు: సైబరా-బాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల వెబ్‌‌‌‌సైట్లు(www.cyberabadpolice.gov.in , www.rachakondap olice.telangana.gov.in) లలో మాల్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ చొరబడింది. ఈ రెండు వెబ్‌‌‌‌సైట్లు వారం రోజులుగా పనిచేయడం లేదు. ఓపెన్‌‌‌‌ చేయగానే ఎర్రర్‌‌‌‌‌‌‌‌లు వస్తున్నాయి.  పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్‌‌‌‌ అధికారుల కాంటాక్ట్​ నంబర్స్‌‌‌‌ అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో సమస్య పరిష్కారానికి  కమిషనరేట్ల ఐటీ టీమ్స్‌‌‌‌ రంగంలోకి దిగాయి.

  నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌‌‌‌ఐసీ) పర్యవేక్షణలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు సైట్ల పునరుద్ధరణకు అవసరమైన సాఫ్ట్‌‌‌‌వేర్లు అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేస్తున్నారు. హ్యాకింగ్‌‌‌‌కు గురి కాకుండా అధునాతన ఫైర్‌‌‌‌‌‌‌‌వాల్స్‌‌‌‌ ఆడిట్ చేస్తున్నారు. కాగా, నెట్‌‌‌‌వర్క్ సమస్యల కారణంగా వెబ్‌‌‌‌సైట్ డౌన్ అయ్యిందని సంబంధిత అధికారులు చెప్తున్నారు.