ములుగు, వెలుగు / తాడ్వాయి : గ్రామాలను ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికైన ములుగు మండలం అంకన్న గూడెం సర్పంచ్ కొట్టేం రాజు, రాయినిగూడెం సర్పంచ్ ఈసం సునీత, వెంకటాపూర్ మండలం అడవి రంగాపూర్ సర్పంచ్ దొంతర బోయిన లక్ష్మిని బుధవారం క్యాంప్ఆఫీస్లో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. గ్రామాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకోవడం సంతోషకరమని అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు ఎండీ.చాంద్ పాషా, చెన్నోజు సూర్య నారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మారం సుమన్ రెడ్డి పాల్గొన్నారు.
అదేవిధంగా తాడ్వాయి మండలం మంబాపూర్ పంచాయతీ ముక్తి శ్రీనివాస్, అంకంపల్లి గ్రామం వెంకటేశ్వర్లు, నర్సాపూర్ గ్రామ పంచాయతీ యాప కళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని మంత్రి సీతక్క తాడ్వాయి కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట శాలువాలు కప్పి సత్కరించి సన్మానించారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్ లో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
