నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు పరిశీలించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు పరిశీలించాలి :  కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా, వెలుగు: నామినేషన్ పత్రాల పరిశీలన నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.బుధవారం ఆమె నల్గొండ జిల్లా నిడమనూరు, ముకుందాపురం పంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ని నామినేషన్లు వచ్చాయి.. ఎన్ని రిజక్ట్ చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ పై ఆరా తీశారు. ప్రతి అభ్యర్థి సమర్పించిన పత్రాలు పూర్తిగా  సమాచారంతో ఉండేలా చూడాలన్నారు. 

అనంతరం కలెక్టర్ త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, హాస్టల్  సౌకర్యాలు పరిశీలించి బాలికలకు అందిస్తున్న సేవలపై ఉపాధ్యాయులతో చర్చించారు.  స్కూల్ బిల్డింగు రెండు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు .ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంఈఓ రవికుమార్ ,పాఠశాల ప్రిన్సిపల్ భారతి ,తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు .