జనగామ అర్బన్, వెలుగు : నో స్కల్పెల్ వాసెక్టమీ (ఎన్ఎస్వీ) సేవల ఏర్పాట్లను జనగామ డీఎంహెచ్వో మల్లికార్జున్రావు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య బృందంతో మాట్లాడి, అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన కౌన్సిలింగ్ సేవలందివ్వాలని సూచించారు. బుధవారం మొత్తం 13 మంది లబ్ధిదారులు ఎన్ఎస్వీ సేవలు పొందారని తెలిపారు.
పురుషుల పాత్రను కుటుంబ నియంత్రణలో పెంపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఎన్ఎస్వీ ఒక సురక్షితమైన, సులభమైన, సమర్దవంతమైన శాశ్వత పద్ధతని తెలిపారు. కార్యక్రమాన్ని సమర్దవంతంగా నిర్వహించిన పీవో, ఏపీవో, హాస్పిటల్ సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. జిల్లావ్యాప్తంగా ఎన్ఎస్వీ సేవల స్వీకరణ పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
