యాదాద్రి, నల్గొండ/ వెలుగు: ఉమ్మడి జిల్లాలో మూడవ విడత జరగనున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం బుధవారం నుంచి మొదలైంది. 5 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం అర్హత కలిగిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 9 వరకు నామినేషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించానున్నారు. యాదాద్రి జిల్లాలోని ఆరు మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరిగే 124 పంచాయతీలు, 1086 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ స్టార్ అయింది. మొదటి రోజైన బుధవారం పంచాయతీల్లో సర్పంచ్ కోసం 133 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు 253 నామినేషన్లు దాఖలయ్యాయి.
యాదాద్రి జిల్లాలో మండలాల వారీగా..
అడ్డగూడూరు మండలంలో 17 పంచాయతీలకు 20 నామినేషన్లు, 150 వార్డులకు 40 వేశారు. చౌటుప్పల్లో 26 పంచాయతీలకు 24 నామినేషన్లు, 236 వార్డులకు 69 దాఖలయ్యాయి. గుండాలలో 20 పంచాయతీలకు 15 నామినేషన్లు, 182 వార్డులకు 22 వచ్చాయి. మోటకొండూరులో 20 పంచాయతీలకు 23 నామినేషన్లు, 170 వార్డులకు 57 వేశారు. మోత్కూరులో 10 పంచాయతీలకు 21 నామినేషన్లు వేయగా, 88 వార్డులకు 11 వేశారు. నారాయణపూర్లో 31 పంచాయతీలకు 30 నామినేషన్లు, 260 వార్డులకు 56 దాఖలు చేశారు.
సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ డివిజన్ పరిధిలో 146 గ్రామాలు, 1338వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తారు.చింతలపాలెం 16, గరీడే పల్లి 33, హుజూర్ నగర్ 11, మట్టంపల్లి 29, మేళ్లచెర్వు 16, నేరేడు చర్ల 19, పాలకీడు 22 గ్రామాలు నల్గొండ జిల్లాలో దేవరకొండ డివిజన్ పరిధిలోని 269 గ్రామాలు, 2206 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు, చందంపేట 30 గ్రామాలు, చింతపల్లి 36, దేవరకొండ 41, గుడిపల్లి 12, డిండి 39, గుర్రంపోడ్ 38, కొండమల్లేపల్లి 27, నేరేడు గొమ్ము 21, పెద్ద అడివిశర్ల పల్లి 25 గ్రామాలు
