షర్మిల కాంగ్రెస్​లోకి వస్తే స్వాగతిస్తం

షర్మిల కాంగ్రెస్​లోకి వస్తే  స్వాగతిస్తం
  • దేశం మొత్తానికి వైఎస్​ ఆదర్శం: భట్టి విక్రమార్క
  • ఇడుపులపాయలో వైఎస్సార్​ సమాధిని సందర్శించిన సీఎల్పీ నేత

హైదరాబాద్​, వెలుగు: వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు ​షర్మిల కాంగ్రెస్​లోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ రాజశేఖర్​ రెడ్డి తన జీవితం మొత్తం కాంగ్రెస్​ పార్టీకే ధారపోశారని, ఆయన వారసురాలిగా ఆమెకు వెల్​కమ్​ చెప్పాల్సిందేనని భట్టి స్పష్టం చేశారు. గురువారం ఏపీలోని ఇడుపులపాయలో ఉన్న రాజశేఖర్​ రెడ్డి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. తన పీపుల్స్​ మార్చ్​ పాదయాత్ర సందర్భంగా తనతో పాటు కలిసి వచ్చిన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది సహా 45 మందితో ఆయన తిరుపతికి వెళ్లారు. దారిమధ్యలో రాజశేఖర్​ రెడ్డి సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు. రాజశేఖర్​ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం, చదువు, ఆర్థిక కష్టాలు సహా రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మంచి పథకాలను అమలు చేశారన్నారు. అతని ఆలోచనలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో వైఎస్​ హయాంలో ఎమ్మెల్యేగా, చీఫ్​ విప్​గా పనిచేశానని, ఇప్పుడు రాహుల్​ గాంధీ నాయకత్వంలోనూ పనిచేస్తున్నానని, అది తన అదృష్టమని భట్టి చెప్పారు.