గుడ్ న్యూస్ : త్వరలో 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ

గుడ్ న్యూస్ : త్వరలో  6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ

త్వరలో 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు డిప్యూటీ  సీఎం భట్టి విక్రమార్క.  ఇప్పటికే 11 వేల 62 పోస్టులకు డీఎస్సీ నిర్వహించాం మరో వారం రోజుల్లో ఫలితాలు రిలీజ్ చేస్తామని  తెలిపారు.   30 వేల మంది టీచర్లకు  ప్రమోషన్ లు ఇచ్చాం..45 వేల మందికి ట్రాన్స్ఫర్ లు  చేశామని చెప్పారు భట్టి. 

టీచర్స్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన గురుపూజోత్సవానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో మొదట టీచర్లకే ప్రాధాన్యం ఇచ్చామన్నారు. విద్యావ్యవస్థలో ఏ మార్పులు వచ్చినా మొదట స్వాగతించేది టీచర్లేనన్నారు భట్టి. గురువులు అభ్యుదయభావంతో ఆలోచించినప్పుడే..సమాజం మంచిమార్గంలో వెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 

అమ్మ ఆదర్శ పాఠశాలలకు 667 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు.  రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయాల్సింది గురువులేనన్నారు.  విద్యార్థులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  ప్రభుత్వం,  పారిశ్రామిక వేత్తలతో కూడిన సమన్వయ కమిటీ ద్వారా సిలబస్ తయారు చేస్తున్నామని తెలిపారు. 63 ఐటీఐ కేంద్రాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ  కేంద్రాలుగా మారుస్తున్నామన్నారు భట్టి.    ఉస్మానియా వర్సిటీని 10 ఏళ్ళు గాలికి వదిలేశారు. ఈ సారి ఉస్మానియా వర్శిటీ లో మౌలిక వసతుల కోసం 100 కోట్లు కేటాయించామన్నారు.