
ధనరాజ్, సప్తగిరి, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, అజయ్ ఇలా ప్రధాన తారాగణం అంతా స్టన్నింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో చూస్తుండటం ఆసక్తికరంగా ఉంది. 'ది హంటెడ్ హౌస్' అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ చిత్రం టీజర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్‌తో పాటు హ్యూమర్, ఫన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. సమ్మర్ స్పెషల్‌గా మే లో ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.