- హాజరైన వెంకయ్యనాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
శంషాబాద్, వెలుగు: దేశరక్షణతో పాటు రైతు రక్షణ కీలకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. దేశ సమగ్రాభివృద్ధి కోసం అన్ని రంగాలు అవసరమే అయినప్పటికీ తొలుత రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. పౌష్టికాహారంతో సమాజాన్ని హిడెన్ హంగర్ నుంచి కాపాడాలని సూచించారు.
ఆదివారం ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన రైతు నేస్తం పురస్కారాల ప్రదానోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఆయన హాజరయ్యారు. భూమి హక్కుల కార్యకర్త సునీల్ కుమార్‌కు భూమి రత్న బిరుదు అందజేశారు.
రైతుల కోసం మాస పత్రిక నడుపుతున్న వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాస్త్రవేత్త కొసరాజు చంద్రశేఖర్ రావు కు జీవన సాఫల్య పురస్కారాలు, జొన్నలగడ్డ చంద్రశేఖర్ రావుకు కృషిరత్న బిరుదులు ప్రదానం చేశారు. ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించాలని, సిరిధాన్యాల ఉత్పత్తికి ఊతమివ్వాలని ఈ సందర్భంగా వెంకయ్య సూచించారు.
