చిట్యాల, వెలుగు: ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాలం మండలం జడలపేటలో సోమవారం రాత్రి రత్న సారయ్య ఇంటిపై పిడుగుపడి పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గాంధీనగర్ గ్రామానికి చెందిన రత్న కిరణ్ గుండెపోటుతో మరణించగా, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
