జయశంకర్భూపాలపల్లి, వెలుగు: సింగరేణి మరింత ప్రగతి సాధించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దసరా పండుగ వేళ 40వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్చెల్లించి కార్మికులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. మంగళవారం భూపాలపల్లి జీఎం ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన సింగరేణి ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యే చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నెముకలా నిలుస్తుందని తెలిపారు. కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ ఆధునికీకరణ, సాంకేతిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జీఎం రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సెమీ క్రిస్మస్ వేడుకలు..
భూపాలపల్లిరూరల్ : భూపాలపల్లిలోని మంజూరునగర్ లో కల్వరి చర్చిలో జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని కెక్ కట్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
