లిక్కర్ స్కాం కేసులో..మాజీ సీఎం కొడుక్కి14 రోజులు రిమాండ్

లిక్కర్ స్కాం కేసులో..మాజీ సీఎం కొడుక్కి14 రోజులు రిమాండ్

లిక్కర్ స్కాం కేసులో చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్ కుమారుడు చైతన్య భాఘేల్ ను 14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది రాయ్ పూర్ కోర్టు. ఐదు రోజుల ఈడీ కస్టడీ విచారణ ముగిసిన తర్వాత కోర్టు చైతన్య భాఘేల్ కు ఆగస్టు 23నుంచి సెప్టెంబర్ 6 వరకు పద్నాలుగు రోజుల కస్టడీ విధించింది. 

చైతన్య బాఘేల్‌ను జూలై 18న ED అరెస్టు చేసింది. ఈ కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు 2వేల161 కోట్లకు పైగా మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. లంచాల నెట్‌వర్క్, పుస్తకాల వెలుపల అమ్మకాలు,లైసెన్స్ తారుమారుతో కూడిన ఈ స్కామ్ వెనక చైతన్య బాఘేల్ ను ప్రధాన సూత్రధారిగా ఈడీ గుర్తించింది.

ఈ కుంభకోణం ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) ద్వారా జరిగిందని అనుకూలమైన మార్కెట్ యాక్సెస్ కోసం మద్యం డిస్టిలర్ల నుంచి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ దుకాణాల ద్వారా దేశీయ మద్యం చట్టవిరుద్ధంగా విక్రయించారని , నిర్దిష్ట కంపెనీల ప్రయోజనం కోసం విదేశీ మద్యం లైసెన్స్‌లను (FL-10A) తారుమారు చేశారని ED దర్యాప్తులో తేలింది. 

ఈ కేసులో వ్యాపారవేత్త అన్వర్ ధేబర్, మాజీ అధికారి అనిల్ తుటేజా, మాజీ ఎక్సైజ్ మంత్రి కవాసి లఖ్మా వంటి అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ స్కంలో ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు రూ. 205 కోట్ల విలువైన ఆస్తులను ED అటాచ్ చేసింది.