రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్..

రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్..

 

టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబర్ లో భారత్ తరపున చివరి వన్డే ఆడిన ఈ యూపీ బౌలర్ తాజాగా వరల్డ్ కప్ కి ఎంపిక చేసిన 15 మంది ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా నేషనల్ న్యూస్ తో మాట్లాడిన భువీ.. తన  రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చేసాడు.

కెరీర్ చివరి దశలో ఉన్నాను
 
టీమిండియాలో రీ ఎంట్రీపై భువనేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేసాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ చివరిదశలో ఉందని చెప్పాడు.మన కెరీర్ ఎలా సాగుతుందనే విషయం మన మనసు మనకి తెలియజేస్తుందని ప్రస్తుతం నేను అలాంటి స్టేజ్ లోనే ఉన్నానని తెలిపాడు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కనందుకు నాకు బాధగా లేదంటూ తన దృష్టాంతా నాణ్యమైన క్రికెట్ ఆడడం మీదే ఉందని ఈ సందర్భంగా తెలియజేశాడు. 

ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ యూపీ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్ లో ఈ  స్పీడ్ స్టార్ సన్ రైజర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. భువీ పరిస్థితి చూస్తుంటే భారత జట్టులో ఇక చోటు దక్కనట్లుగానే కనిపిస్తుంది. యంగ్ ప్లేయర్లు దూసుకురావడంతో  భువి రీ ఎంట్రీపై ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 33 ఏళ్ల భువీ తన వరుస వైఫల్యాలతో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది.