
నిజాంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామ పెద్ద చెరువుకు గండి పడడంతో చెరువు కట్ట ప్రమాదంలో పడింది. కట్ట తెగిపోయి ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న నిజాంపేట మండల పరిధి నస్కల్, రాంపూర్ గ్రామాల్లో 40 మంది ఎస్డీఆర్ఆఫ్, ఎన్డీఆర్ఆఫ్ బృందాలు అలర్ట్ గా ఉన్నాయి.
గురువారం రాత్రి నుంచి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి తమ సిబ్బందితో అక్కడే ఉన్నారు. ముంపు గ్రామాల ప్రజలను నస్కల్ జడ్పీ హైస్కూల్ లో, రైతు వేదికలో ఉంచారు. 400 మంది గ్రామస్తులకు భోజనాలు అందించామని తహసీల్దార్ తెలిపారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని రిస్క్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.