ఫస్ట్ డే దుమ్ముదులిపేసిన బిచ్చగాడు2.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్

ఫస్ట్ డే దుమ్ముదులిపేసిన బిచ్చగాడు2.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్

బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు2 మూవీకి బాక్సాఫీస్ దగ్గర సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మే 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వచింది. దీంతో ఈ సినిమాకు మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా మొదటిరోజు ఏకంగా 6 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. 

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. మాతృక తమిళంలో కన్నా తెలుగులోనే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మొదటిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.24 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేదని మరోసారి ప్రూవ్ చేసింది బిచ్చగాడు2 మూవీ. 

ఇక 2016లో వచ్చిన బిచ్చగాడు మూవీకి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. బిచ్చగాడు మూవీకి తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సినిమాలో మదర్ సెంటిమెంట్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు మరోసారి బిచ్చగాడు2 సినిమాను కూడా తెలుగు ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా లాంగ్ రన్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.