వేములవాడ రూరల్, వెలుగు:- మర్రిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పదోతరగతి విద్యార్థులు 11 మందికి బీజేపీ ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రధాని మోదీ గిఫ్ట్‌గా వీటిని పంపించినట్లు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకష్ణ, వేములవాడ మాజీ ఎంపీపీ బండ మల్లేశం తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లాస్య, మాజీ సర్పంచ్ కటకం మల్లేశం, నాయకులు గోపు బాలరాజు, చెట్టిపల్లి రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు.
బోయినిపల్లి, వెలుగు: బోయినిపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థినులు 10 మందికి బీజేపీ నాయకులు శనివారం సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గవర్నమెంట్సూళ్లలో పదోతరగతి విద్యార్థినులకు సైకిళ్లు అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు ఇరువాల సంధ్య, బొంగోని అశోక్ గౌడ్, ఇల్లందుల రాజేశం, బీజేపీ మండల అధ్యక్షుడు పరశురాం, జిల్లా కో కన్వీనర్ నరసింహాచారి, నాయకులు రాజేంద్రప్రసాద్, ఇల్లందుల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
