సౌదీ క్రౌన్ ప్రిన్స్ పై వీసా బ్యాన్ ఎత్తేసినం : అమెరికా

సౌదీ క్రౌన్ ప్రిన్స్ పై  వీసా బ్యాన్ ఎత్తేసినం : అమెరికా

వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆ దేశానికి ప్రధానిగా నియమితులవడంతో ఆయనపై వీసా బ్యాన్ ను ఎత్తేశామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపైనా ఇలాగే బ్యాన్​ను ఎత్తేశామని వివరణ ఇచ్చింది. సౌదీకి చెందిన జమాల్ ఖషోగీ ఇస్తాంబుల్​లోని సౌదీ కాన్సులేట్​లో 2018లో హత్యకు గురయ్యారు.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని ఖషోగీ భార్య కేసు పెట్టారు. ఈ కేసు సంచలనంగా మారడంతో సల్మాన్​పై అమెరికా వీసా బ్యాన్ ప్రకటించింది. ఇటీవల ఆయన సౌదీ ప్రధానిగా నియమితులవడంతో బ్యాన్​ను ఎత్తేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ కోర్టుకు తెలిపింది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థతో పాటు మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా విమర్శలు చేశాయి.