ఇజ్రాయెల్ హమాస్‌ను నిర్మూలించాలి..కానీ గాజాను ఆక్రమించడం పెద్ద తప్పు: బైడెన్

ఇజ్రాయెల్ హమాస్‌ను నిర్మూలించాలి..కానీ గాజాను ఆక్రమించడం పెద్ద తప్పు: బైడెన్

ఇజ్రాయిల్పై హమాస్ దాడుల తర్వాత  గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విరుచుకుపడుతోంది.  గత వారం రోజులుగా గాజాపై వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడిలతో గాజా నగరం వణికిపోతోంది. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వాయు, జల, భూతలసేనలతో ముప్పేట దాడులకు సిద్ధమైంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

హామాస్ తీవ్రవాదాన్ని అంతమొందించడం మంచిదే కానీ.. గాజాను ఆక్రమించడం పెద్ద తప్పు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తీవ్రవాదాన్ని నిర్మూలించాలి.. అదే సమయంలో పాలస్తీనియన్లకు  రాజ్యం దిశగా మార్గం చూపించాలి అని బైడెన్ అన్నారు. పాలస్తీనా అధికారం ఉండాలి.. పాలస్తీనాకు రాష్ట్రం ఉండాలి అని స్పష్టం చేశారు. అక్టోబర్ 7 న హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఇదంతా ఏమీ ఆలోచించలేదు.. పాలస్తీనియన్ ప్రజలు హమాస్ వ్యూహాలను పంచుకోవడం లేదని బైడెన్ అన్నారు. 

ఇజ్రాయెల్ పై హామాస్ దాడుల తర్వాత పరిస్థితులు  రెండో ప్రపంచ యుద్దంలో హోలికాస్ట్ పర్యవసానాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ స్పందించాలని బైడెన్ చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 2వేలకు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.