
- పోలెండ్ స్వేచ్ఛకు బాధ్యత తమదని హామీ
- యూరప్ పర్యటన ముగింపు
వార్సా: నాటోను విభజించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టంచేశారు. ‘‘నాటో కచ్చితంగా ఐక్యంగానే ఉంటుంది. మా దృష్టిలో విభజన అనేదే లేదు’’ అని అన్నారు. యూరప్ పర్యటనలో ఉన్న బైడెన్.. శనివారం వార్సాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో పోలెండ్ ప్రెసిడెంట్ ఆండ్రేజ్ దుడాతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ముగించే లక్ష్యాలను గురించి చర్చించుకున్నారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. అమెరికా, పోలెండ్ సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయని దుడా చెప్పారు. ‘మీ స్వేచ్ఛ మాది’ అని పోలెండ్ ప్రధానితో చెప్పిన బైడెన్.. పోలెండ్‌పై రష్యా దాడులు చేస్తే అమెరికా కాపాడుతుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో యుద్ధం వల్ల తలెత్తిన శరణార్థుల సంక్షోభ భారాన్ని పోలెండ్ భరిస్తున్నదని అన్నారు. ప్రస్తుత మానవతా సంక్షోభంలో పోలెండ్ ముఖ్యమైన బాధ్యత తీసుకుంటోందని, ఆ దేశంపై పడిన భారాన్ని తగ్గించుకోవడానికి ప్రపంచం సాయం చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత యూరప్ పర్యటన ముగించుకుని వాషింగ్టన్‌కు వెళ్లిపోయారు.
ఉక్రెయిన్ మంత్రితో భేటీ
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్ కీలక నేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ అయ్యారు. పోలెండ్‌లోని వార్సాలో పర్యటిస్తున్న బైడెన్.. శనివారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా, రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌తో
సమావేశమయ్యారు.