Big Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లోకి భరణి, శ్రీజ రీ ఎంట్రీ.. దివ్వెల మాధురి, దమ్ము శ్రీజ మధ్య వార్ స్టార్ట్!

Big Boss Telugu 9:  బిగ్ బాస్ హౌస్‌లోకి భరణి, శ్రీజ రీ ఎంట్రీ.. దివ్వెల మాధురి, దమ్ము శ్రీజ మధ్య వార్ స్టార్ట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఊహించని ట్విస్టులతో రణరంగాన్ని తలపిస్తోంది.  మొన్నటి వరకు హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల హంగామా నడిచింది. ముఖ్యంగా రమ్య మోక్ష, మాధురి వంటి కంటెస్టెంట్‌ల మధ్య జరిగిన వ్యక్తిగత దాడులు, మాటల యుద్ధం ప్రేక్షకులను కొంత విసుగు తెప్పించింది. ఫలితంగా..  గత వారం రమ్య మోక్ష హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది.  అయితే ఈ వారం బిగ్ బాస్ ఊహించని మలుపుతిరిగింది. కానీ, బిగ్ బాస్ అంటేనే ఊహించని ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్!

ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌ల రీ-ఎంట్రీ..

ఈ వారం ప్రేక్షకులు, కంటెస్టెంట్‌లు ఊహించని విధంగా బిగ్ బాస్ సరికొత్త రూల్ తీసుకొచ్చారు. అదే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌ల రీ-ఎంట్రీ. గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లను వెనక్కి తీసుకొచ్చి, వారి ద్వారా మిగిలిన హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేయించడం ఈ వారం ప్రక్రియకే హైలైట్ నిలిచింది. అయితే ఈ సారి బిగ్ బాస్ ఏకంగా ఇద్దరు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌లను - దమ్ము శ్రీజ, భరణిలను - నేరుగా హౌస్‌లోకి తిరిగి తీసుకువచ్చి మెగా ట్విస్ట్ ఇచ్చాడు.

హాట్ హాట్‌గా కౌంటర్లు, ఛాలెంజ్‌లు..

లేటెస్ట్ గా రిలీజ్ అయిన  ప్రోమో హౌస్‌లో రణరంగం తలపించేలా ఉంది. తిరిగి వచ్చిన భరణి, శ్రీజ గతంలో చేసిన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవాలని బిగ్ బాస్ సూచించారు. అప్పుడు హౌస్‌మేట్స్ వచ్చి, ఆ ఇద్దరిలో తమకు నచ్చని విషయాలను మార్చుకోవాలని సూచించారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. ముందుగా వచ్చిన ఇమ్మాన్యుయేల్, శ్రీజకు సలహా ఇస్తూ, గొడవలు, ఆర్గ్యూమెంట్స్ మంచిదే, కానీ మరీ దానిని లాగకూడదు అని అన్నాడు.

పవన్ vs భరణి.. 

ఇక డిమాన్ పవన్ వచ్చి, భరణిని ఉద్దేశించి.. మీ విషయంలో నాకు మూడు సార్లు నమ్మకం పోయింది. మిమ్మల్ని మళ్లీ నమ్మాలంటే కాస్త ఆలోచించాలి అని సూటిగా చెప్పాడు. దీనికి భరణి ఏమాత్రం తగ్గకుండా, నన్ను నమ్మడం, నమ్మకపోవడం అనేది నీ ఇష్టం. అది నీ పర్సనల్ పాయింట్ అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చి తన మొండితనాన్ని చూపించాడు.

►ALSO READ | Priyamani : షూటింగ్ టైమింగ్స్‌పై ప్రియమణి బోల్డ్ కామెంట్స్.. నార్త్-సౌత్ షెడ్యూల్స్‌పై ఓపెన్ టాక్!

శ్రీజ vs మాధురి ఫైర్ 

ఈ వారం నామినేషన్స్‌లో అందరూ ఊహించినట్లుగానే మాధురి వర్సెస్ దమ్ము శ్రీజ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాధురి వచ్చి, శ్రీజను ఉద్దేశించి "మైండ్ యువర్ వర్డ్స్" అనే పాయింట్‌ను అద్దంపై రాసింది. దీనికి శ్రీజ వెంటనే స్పందిస్తూ, నేను ఎప్పుడూ నోటికి ఏది వస్తే అది మాట్లాడను. మీరు మాట్లాడినట్లు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు ఇచ్చిన సలహాను నేను అస్సలు యాక్సెప్ట్ చేయను  అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 

మొత్తానికి, దమ్ము శ్రీజ, భరణి రీ-ఎంట్రీతో హౌస్‌లో గ్రూపులు, గొడవలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.  శ్రీజ మరోసారి హౌస్‌ను 'రణరంగం'గా మారుస్తుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.  మరి శ్రీజ రాకతో మాధురి, ఇమ్మాన్యుయేల్‌ల ఆట ఏ విధంగా మారుతుందో చూడాలి..