తైవాన్‌లో భూకంపం, జపాన్‌లో సునామి.. పాతికేళ్ల తర్వాత మళ్లీ బీభత్సం

తైవాన్‌లో భూకంపం, జపాన్‌లో సునామి.. పాతికేళ్ల తర్వాత మళ్లీ బీభత్సం

తైవాన్ దేశంలో బుధవారం (ఏప్రిల్ 3) ఉదయం సంభవించిన భూకంపం బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పటి వరకు అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం ఏడుగురు మరణించారు. రెక్టార్ స్కేల్‌పై 7.4 తీవ్రత నమోదైంది. ఈ ప్రకృతి విపత్తులో 700 మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. తైవాన్‌లో 25ఏళ్ల  తర్వాత మళ్లీ ఇంత పెద్ద భూకంపం వచ్చింది.  1999లో తైవాన్ లోని నాంటౌ కౌంటీలో రెక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూమి అతలాకుతలం అయింది. ఆ సమయంలో 2500 మంది చనిపోగా.. 1300 మంది గాయపడ్డారు. తైవాన్‌లోని హువాలియన్‌ కేంద్రంగా ఈరోజు భూకంపనలు ప్రారంభమయ్యాయి.


 తైవాన్‌లో 26 బిల్డింగులు కుప్ప కలిపోయాయి. వాటిలో ఎక్కువగా కౌంటీలోనే నేలమట్టం అయ్యాయి. కూలిపోయిన శిథిలాల్లో చిక్కుకున్న 20 మందిని రక్షించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెవాన్‌లో భూకంపం కారణంగా జపాన్‌లోని యోనాగుని ద్వీపంలో సునామీని సంభవించింది. 26సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు జపాన్ లో సునామీ వచ్చింది. 91వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తెవాన్ రాజధాని తైపీలో బిల్డింగుల పెచ్చులు ఊడిపడ్డాయి. దేశవ్యాప్తంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి.

ALSO READ :- నల్ల ఉప్పు బియ్యం ఏంటీ.. ఎక్కడ పండిస్తున్నారు.. వివాదం ఏంటీ..?