
భారత చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ (LPG) సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అయితే కొన్ని నెలల క్రితం వంటింటి సిలిండర్ ధరను రూ. 50 పెంచిన సంగతి మీకు తెలిసిందే. కానీ సబ్సిడీ కింద గ్యాస్ పొందే వారికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ అందిస్తుంది. వంటింటి ఖర్చుల భారం తగ్గించేందుకు అలాగే సామాన్యుడికి ఆసరగా ఈ సబ్సిడీ ఎంతో మేలు చేస్తుంది. వీటన్నింటి మధ్య కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీకి సంబంధించి ఒక కీలక నిర్ణయానికి వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14.2 కిలోల వంటింటి గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని పెంచినట్లు ప్రకటించారు, దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుంది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ సబ్సిడీ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే, సబ్సిడీ పొందడానికి కొన్ని రూల్స్ పాటించాలి. సిలిండర్‌ను 9 సార్లు నింపిన తర్వాత లబ్ధిదారులు రూ. 300 సబ్సిడీ పొందవచ్చు.
ఈ సబ్సిడీ పెంపుదల ఒక్కటే 1 లక్ష కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. మరోవైపు భారతదేశం LPG అవసరాలలో దాదాపు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రపంచ మార్కెట్లో LPG ధరలలో హెచ్చుతగ్గుల ప్రభావం మొదట పేద కుటుంబాలపై పడుతుంది.
పేద కుటుంబాలపై ఆర్ధిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మే 2022లో వంటింటి గ్యాస్ సిలిండర్ పై రూ.200 సబ్సిడీ అందించడం ప్రారంభించింది. ఇప్పుడు, ఆ మొత్తాన్ని రూ. 300కు పెంచారు, ఈ సబ్సిడీ పెంపు 5 కిలోల సిలిండర్లకు కూడా వర్తిస్తుంది.
గతంలో ప్రతి సంవత్సరం 12 సిలిండర్లకు సబ్సిడీ ఇచ్చేది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఉజ్వల పథకం లబ్ధిదారుల వినియోగ రేటు పెరుగుతున్నట్లు తెలిసింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన మే 2016లో ప్రారంభించారు. ఈ పథకం ఉద్దేశం ఎటువంటి డిపాజిట్ లేకుండా పేద మహిళలకు LPG కనెక్షన్లను ఇవ్వడం. 1 జూలై 2025 నాటికి దేశవ్యాప్తంగా 10.33 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు చాలా ఇళ్లలో LPG సిలిండర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కూడా.