పేద విద్యార్థులకు ‘బిగ్​హెల్ప్’

 పేద విద్యార్థులకు ‘బిగ్​హెల్ప్’

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతిభ గల విద్యార్థులు చదువుకు దూరం కావద్దని వారికి బిగ్‍హెల్ప్ ఫర్‍ ఎడ్యుకేషన్‍ ట్రస్ట్ ఆర్థిక తోడ్పాటునందిస్తుంది. ప్రతిభ ఉన్నప్పటికీ లక్ష్మీ కటాక్షం లేక చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అర్హత గల విద్యార్థులకు  బిగ్‍హెల్ప్ నేషనల్‍ మెరిట్‍ స్కాలర్‍షిప్స్ అందజేస్తుంది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. పదో తరగతి ఫలితాల్లో 9.8 గ్రేడ్‍ ఆపై లేదా 98శాతం మార్కులు సాధించిన వారు ఈ స్కాలర్‍షిప్ పథకానికి అర్హులు. ప్రతి విద్యార్థికి రూ.5 వేలు ఏటా స్కాలర్‍షిప్‍ కింద అందజేస్తారు. ఇలా 6 ఏండ్ల పాటు మొత్తం 30 వేలు అందిస్తారు.  పదో తరగతి పాసైన విద్యార్థి తదుపరి ఇంటర్మీడియట్‍, డిగ్రీ లేదా ఇంజినీరింగ్ లేదా ప్రొఫెషనల్‍ కోర్సులు పూర్తి వరకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. దేశ వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను బట్టి ఎంత మంది విద్యార్థులకు స్కాలర్‍షిప్ అందజేయాలని నిర్ణయిస్తారు. విద్యార్థుల కుటుంబ ఆర్థిక పరిస్థితి, పదో తరగతిలో వచ్చిన మార్కులు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకొని స్కాలర్‍షిప్‍కు ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థులను ఫోన్‍లో బిగ్‍హెల్ప్ ఎగ్జిక్యూటీవ్స్ టీం ఇంటర్వ్యూ చేస్తుంది. దీంతోపాటు లోకల్‍ టీమ్స్ ద్వారా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో కూడా వెరిఫై చేయిస్తారు. ఆగస్ట్ 15లోగా స్కాలర్‍షిప్‍కు ఎంపికైన విద్యార్థులను ప్రకటిస్తారు. 2017–18 అకడమిక్‍ ఇయర్‍కు తెలంగాణ, ఏపీలకు చెందిన 60 మంది విద్యార్థులకు స్కాలర్‍షిప్‍లు అందజేశారు.

అర్హులు ఎవరంటే….

…ప్రభుత్వ/జిల్లా పరిషత్‍/మున్సిపల్ స్కూల్స్ లో చదివే విద్యార్థులు

…2018-19 అకడమిక్‍ ఇయర్‍లో పదో తరగతిలో 9.8 గ్రేడ్‍ లేదా 98 శాతం మార్కులు వచ్చిన వారు మాత్రమే స్కాలర్‍షిప్‍కు దరఖాస్తు చేసుకోవాలి.

… విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1 లక్షలోపు ఉండాలి.

…కుటుంబానికి ఒక ఎకరా కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు.

… రెసిడెన్షియల్‍/ప్రభుత్వ ఎయిడెడ్‍ స్కూల్స్/ప్రైవేట్‍ స్కూల్స్/సెంట్రల్‍ గవర్నమెంట్‍ స్కూల్స్/మోడల్‍ స్కూల్స్ లో చదివే విద్యార్థులు ఈ స్కాలర్‍షిప్‍ పథకానికి అనర్హులు.

జతచేయాల్సిన పత్రాలు…

దరఖాస్తు ప్రక్రియ ఏటా మే నెలలో ప్రారంభమవుతుంది. http://bighelp.org వెబ్‍సైట్‍ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‍లోడ్‍ చేసుకోవాలి. దాన్ని పూర్తి చేసి కింద తెలిపిన సర్టిఫికేట్లను జతచేసి కూకట్‍పల్లిలోని బిగ్‍హెల్ప్ కార్యాలయంలో అందజేయాలి.

… రీసెంట్‍గా తీసుకున్న పాస్‍పోర్ట్ సైజ్ ఫొటోలు

…తహసీల్దారు జారీచేసిన ఇన్‍కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్‍ కార్డు

….పదో తరగతి మార్కుల షీట్‍

…ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికేట్‍(దరఖాస్తు చేసుకుంటే)

…స్కాలర్‍షిప్‍ ఎందుకు అవసరం, ప్రస్తుత కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఫ్యామిలీ వివరాలు, భవిష్యత్‍ లక్ష్యాల గురించి వివరిస్తూ విద్యార్థి తన సొంత హ్యాండ్‍ రైటింగ్‍తో ఒక లెటర్‍ రాసి దరఖాస్తుకు అటాచ్‍ చేయాలి.

పూర్తి దరఖాస్తులను జూన్‍ 30లోగా బిగ్‍హెల్ప్ ఫర్‍ ఎడ్యుకేషన్‍, 16 హెచ్‍ఐజీహెచ్‍, ఏపీహెచ్‍బీ, బాలాజీనగర్‍, కూకట్‍పల్లి, హైదరాబాద్‍–500072 అడ్రస్‍లో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. స్వయంగా రావడం వీలుకాని వారు అప్లికేషన్‍ను స్కానింగ్ చేసి ఆ పత్రాలను scholarships@bighelp.org  కు ఈమెయిల్‍ చేయాలి. మరింత సమాచారం కోసం వెబ్‍సైట్‍ను చూడండి లేదా 040-–23152224 నెంబర్‍లో ఆఫీస్ టైమింగ్‍ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు(సోమవారం నుంచి శుక్రవారం) సంప్రదించాలి.