
- విలువ రూ.2,500 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (పీఎంపీఎల్), సింగరేణి టీపీఎస్ స్టేజ్2లో 1x800 మెగావాట్స్ థర్మల్ యూనిట్‌కు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) సర్వీస్‌లను అందించే ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఆర్డర్ విలువ రూ.2,500 కోట్లు(జీఎస్‌టీ మినహాయించి). ఈ ప్రాజెక్ట్‌లో కోల్, బయోమాస్ హ్యాండ్లింగ్, యుటిలిటీస్, వాటర్ ట్రీట్‌మెంట్, ఫైర్ ప్రొటెక్షన్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో తమ కంపెనీ ఈపీసీ సామర్థ్యం మెరుగవుతుందని పీఎంపీఎల్ చైర్మన్ సజ్జా కిషోర్ బాబు అన్నారు. భారత్‌లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ విస్తరిస్తున్నా, థర్మల్ పవర్ కీలకమని తెలిపారు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించిందని, అనుభవంతో, నాణ్యత, భద్రత, కస్టమర్ సంతృప్తిపై దృష్టి పెట్టి మరిన్ని కీలక ప్రాజెక్టులను నిర్మించేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.