స్టార్ హీరో ఆస్తుల వేలం నిలిపివేసిన బ్యాంక్

స్టార్ హీరో ఆస్తుల వేలం నిలిపివేసిన బ్యాంక్

బకాయిలు చెల్లించలేదనే కారణంతో బీజేపీ ఎంపీ, బాలీవుడ్​స్టార్​నటుడు సన్నీ డియోల్​ఆస్తుల వేళానికి సిద్ధపడిన  బ్యాంకు తన నిర్ణయాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకుంది. సాంకేతిక కారణాల వల్ల నోటీసులు వెనక్కి తీసుకున్నట్లు బ్యాంక్​ ఆఫ్​ బరోడా వెల్లడించింది. 

వివరాలు.. సన్నీడియోల్​ 2022 డిసెంబర్​ నుంచి జరిమానా, వడ్డీతో కలిపి మొత్తంగా రూ.55 కోట్ల 99 లక్షలు బ్యాంకుకు బాకీ పడ్డారు. ఇందుకు ప్రతిగా ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఆయన విల్లాను రూ.51 కోట్ల 43 లక్షల రిజర్వ్​ ధరకు ఆగస్టు 25న ఈ వేలం వేయనున్నట్లు బ్యాంక్​ నోటీసులు జారీ చేసింది. 

విల్లాలో పాటు ఆయన తండ్రి ధర్మేంద్ర కు చెందిన భవనాలు కూడా వేలం వేస్తున్నట్లు పేర్కొంది. నోటీస్​ఇచ్చి 24 గంటలు గడవక ముందే వేలం నోటీసులు ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది.  ఈ ఘటనపై కాంగ్రెస్​ పార్టీ విమర్శలు గుప్పించింది. 

బ్యాంకు పేర్కొన్న సాంకేతిక కారణాలను ఎవరు ప్రేరేపించారని ఆశ్చర్యపోతున్నారా?అంటూ  కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాం రమేశ్ ​బీజేపీని ఉద్దేశించి వ్యంగ్యంగా   ట్వీట్​చేశారు.