యూఎస్ ఓపెన్​లో పెద్ద సంచలనం

 యూఎస్ ఓపెన్​లో పెద్ద సంచలనం

న్యూయార్క్:  యూఎస్ ఓపెన్​లో అది పెద్ద సంచలనం నమోదైంది. టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రపంచ రెండో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రఫెల్​నడాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చుక్కెదురైంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా 22 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గెలిచిన అతని విజయ యాత్రకు యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. సోమవారం అర్ధరాత్రి  జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్ ప్రి క్వార్టర్​ ఫైనల్లో అమెరికా ఆటగాడు , 22వ సీడ్​  ఫ్రాన్సిస్ టియఫో  6-–-4,4-–-6,6-–-4,6-–-3తో  నడాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టియఫో 18 ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 49 విన్నర్లు కొట్టి, ఐదు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లు సాధించగా, నడాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9 ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 33 విన్నర్లు, రెండు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లకే  పరిమితం అయ్యాడు. 
అమెరికా ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 28 తప్పిదాలు చేయగా.. రఫా 28 తప్పిదాలు, 9 డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. మరో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   తొమ్మిదో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రబ్లెవ్​ (రష్యా) 6–4, 6–4, 6–4తో వరుససెట్లలో నోరీ (బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ని చిత్తు చేశాడు. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో  స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  మూడో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్ఫియా  6–4, 3–6, 6–4, 4–6, 6–3తో 15వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్రొయేషియా)ను, సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఇటలీ ) 6–1, 5–7, 6–2, 4–6, 6–3తో ఇవష్క (బెలారస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను ఓడించి  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరారు.
 ఇక, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  టాప్​ సీడ్​ స్వైటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పోలెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  2–6, 6–4, 6–0తో నీమియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)ను ఓడించగా, ఎనిమిదో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెగులా (అమెరికా) 6–3, 6–2తో 21వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పెట్రా క్విటోవా (చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై నెగ్గింది. ఆరో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబలెంకా (బెలారస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 3–6, 6–3, 6–2తో 19వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొలిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై, 22వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లిస్కోవా (చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 7–5, 6–7 (5/7), 6–2తో అజరెంకా (బెలారస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టారు.