అయ్యో పాపం.. IPL 2026 ఫైనల్కి ముందు ఆర్సీబీకి బిగ్ షాక్

అయ్యో పాపం.. IPL 2026 ఫైనల్కి ముందు ఆర్సీబీకి బిగ్ షాక్

IPL 2026 Final: ఐపీఎల్ (IPL 2026) గ్రాండ్ విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు టైటిల్ పోరు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. వరుసగా రెండోసారి కప్పు కొట్టాలనే ఫుల్ జోష్‌లో ఉన్న ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు బెంగళూరు నగర పోలీస్ శాఖ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ తర్వాత నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా బెంగళూరు పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు.  

ఆంక్షలు విధించడానికి మెయిన్ రీజన్?: 
గత ఏడాది (2025) ఐపీఎల్ సీజన్ విజేతగా ఆర్‌సీబీ అవతరించినప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారీ విజయోత్సవాలు జరిగాయి. స్టేడియం సామర్థ్యానికి మించి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు బయట గుమిగూడటంతో తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మళ్లీ అలాంటి విషాదకరమైన సంఘటనలు పునరావృతం కావొద్దనే బెంగళూరు పోలీసులు ఈసారి కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంది. 

బెంగళూరు పోలీసుల రూల్స్ అండ్ కండిషన్స్: 
* నో పబ్లిక్ స్క్రీనింగ్స్ (LED బ్యాన్): ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లకు ఫేసింగ్ ఉండేలా ఎలాంటి బిగ్ ఎల్‌ఈడీ స్క్రీన్స్ (LED Walls) ఏర్పాటు చేయరాదు. 
* మాల్స్, పబ్స్ లేదా కమర్షియల్ షాప్స్ బయట జనాలకు కనిపించేలా మ్యాచ్‌లను లైవ్ స్క్రీనింగ్ వేయడం పూర్తిగా నిషేధం.
* మ్యాచ్ ముగిసిన తర్వాత రోడ్లు, పార్కులు లేదా పబ్లిక్ ప్లేసెస్‌లో గుంపులుగా చేరి విజయోత్సవాలు జరపకూడదు.
* విజయోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు తీయడం, ఓవర్‌స్పీడింగ్ చేయడం, రోడ్లను బ్లాక్ చేయడం లేదా హారన్లతో న్యూసెన్స్ చేయడం చట్టవిరుద్ధం.
* రద్దీగా ఉండే రోడ్లపై పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బంది కలిగించేలా బాణసంచా కాల్చడం లేదా ఇతర ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  
* గెలుపోటములతో ప్రత్యర్థి జట్ల అభిమానులను రెచ్చగొట్టడం, కించపరచడం లేదా సోషల్ మీడియాలో హేట్ మెసేజ్‌లు, రూమర్స్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించారు. 

టైటిల్ రేసులో గుజరాత్ వర్సెస్ ఆర్‌సీబీ: 
రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ 2026 క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈ సీజన్ ఆరంభం నుంచి ఆర్‌సీబీ చాలా కన్సిస్టెంట్‌గా ఆడుతూ 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్ చేరుకుంది. క్వాలిఫయర్-1 లో గుజరాత్‌కు షాక్ ఇచ్చినప్పటికీ.. క్వాలిఫయర్-2 లో రాజస్థాన్‌ను ఓడించి గిల్ ఆర్మీ మళ్లీ ఫైనల్‌కు దూసుకొచ్చింది. కాబట్టి రేపు జరగబోయే ‘రివెంజ్’ పోరు పీక్స్‌లో ఉండనుంది.  

ALSO READ : RCB గెలవడం కష్టం.. గుజరాత్కే విన్నింగ్ ఛాన్స్..

* ఫైనల్ రోజు మ్యాచ్ చూసే ఫ్యాన్స్ కోసం బెంగళూరు మెట్రో ఒక క్రేజీ ఆఫర్ ప్రకటించింది. కన్ఫర్మ్‌ టికెట్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ప్రతి అభిమానికి గరిష్టంగా రూ.100 విలువైన 2 ఫ్రీ మెట్రో రైడ్స్ లభిస్తాయి. కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే ఉండి మ్యాచ్ ఎంజాయ్ చేయండి అని వెల్లడించింది.