ఇసుక తవ్వకాల నిషేధంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఇసుక తవ్వకాల నిషేధంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాల నిషేధంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  ఏపీలో ఇసుక తవ్వకాలపై  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)  2023 మార్చి 23న నిషేధం విధించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ నిషేధంపై  స్టే తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం..  ఎన్జీటీ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.  ఎన్జీటీ  తీర్పును యధాతధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.   

ALSOREAD:24 గంటల కరెంట్ లేకుండా చేయాలన్నదే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశ్యం : హరీష్ రావు

అయితే ఎన్జీటీ విధించిన రూ. 18 కోట్ల జరిమానాపై మాత్రం స్టే విధించింది.   ఏపీలోని జగన్ ప్రభుత్వం  జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కు అప్పగించింది. అయితే  పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఏపీలో ఇసుక తవ్వకాలను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ చేపట్టింది. ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన ఎన్జీటి.. ఇసుక తవ్వాలపై నిషేధం విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.