
కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలలో మహిళలని అత్యాచారం, హత్యా చేసి సామూహిక ఖననం జరిగాయని ఆరోపణలు వచ్చిన కేసులో ఇవాళ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనపై చివరికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఫిర్యాదు చేసిన వ్యక్తినే కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థల సమీపంలో కొన్ని ప్రదేశాలని గుర్తించి తవ్వకాలు చేసారు, అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దింతో చివరికి ఫిర్యాదు చేసిన వ్యక్తిని సుమారు 20 గంటలకు పైగా విచారించిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎస్ఐటి అధికారులు అతన్ని బెళ్తంగడి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఈ విషయంలో ధర్మస్థల ఆలయ పరిపాలనపై ఫిర్యాదుదారుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలయం సమీపంలో అత్యాచారం, హత్యకు గురైన మహిళలను అక్రమంగా సామూహిక సమాధి చేశారని ఆయన ఆరోపించారు. తరువాత పోలీసులు ఫిర్యాదుదారుడు చూపించిన 16 ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా, అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో సిట్ అధికారులు అతడిని విచారించగా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.