టీ20 వరల్డ్ కప్లో బిగ్ ట్విస్ట్: పాక్ ఫైనల్ వరకూ వెళ్తే.. జరిగే మార్పు ఇదే !

టీ20 వరల్డ్ కప్లో బిగ్ ట్విస్ట్: పాక్ ఫైనల్ వరకూ వెళ్తే.. జరిగే మార్పు ఇదే !


క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నీలో మొత్తం 20 టీమ్స్ పాల్గొననున్నాయి. ఈసారి టోర్నీని ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICCA) ప్రకటించింది.

క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్  ఒకే గ్రూపులో ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం టోర్నీలోని ఫస్ట్, ఫైనల్ మ్యాచ్ లు గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి.

ఈ టోర్నీలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంటే ఏంటి పరిస్థితి. పాక్ ఫైనల్ మ్యాచ్ ను గుజరాత్ లో ఆడుతుందా..? అనేది ప్రశ్న. అయితే  పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఆ మ్యాచ్ ను శ్రీలంకలోని కొలంబోలో జరపనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.