కేజీఎఫ్-2 సీక్వెల్ పై బిగ్ అప్ డేట్

V6 Velugu Posted on May 14, 2022

రీసెంట్ గా రిలీజై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన KGF-2 మూవీకి త్వరలోనే సీక్వెల్ రాబోతుంది.కేజీఎఫ్-1,కేజీఎఫ్-2 చిత్రాలు సూపర్ హిట్స్ సాధించడంతో  కేజీఎఫ్-3 ఉంటుందా..ఉండదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే కేజీఎఫ్-3 2024లో రాబోతుందని నిర్మాత విజయ్ కరంగదుర్ తెలిపారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ..ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సాలార్ మూవీ ఇప్పటికే 35 శాతం షూట్ కంప్లీట్ చేసుకుందని..నవంబర్ లోపు ఈ సినిమా పూర్తవుతుందని వెల్లడించారు. ఆ తర్వాత కేజీఎఫ్-3 షూట్ మొదలుపెట్టి..2024లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నామని చెప్పారు. మార్వెల్ సిరీస్ లాగా ఓ సరికొత్త రకమైన విశ్వాన్ని సృష్టించబోతున్నామని విజయ్ స్పష్టం చేశారు

Tagged prashanth neel, salaar, pan india movie, Yash, Prabas, kgf2, kgf3

Latest Videos

Subscribe Now

More News