
బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్' 16వ సీజన్‌కు హోస్ట్‌గా రాబోతున్నాడు. తాజాగా కలర్స్ టీవీ ఈ బిగ్ బాస్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. దీంతో పాటు.. ఈ 15 ఏళ్లలో ప్రతి ఒక్కరూ తమ సొంత ఆట ఆడుకున్నారు, కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఆడాల్సిన సమయం వచ్చిందంటూ కలర్స్ టీవీ క్యాప్షన్ ను జత చేసింది. ఈ వీడియోలో సల్మాన్ మరో సారి ఎంట్రీ హోస్ట్ గా రావడం చూసిన ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. రియాలిటీ షోలలో ఒకటైన “బిగ్ బాస్ సీజన్ 16” కు సల్మాన్ మరోసారి హోస్ట్ గా రాబోతుండడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 16 సీజన్ కు సంబంధించిన ప్రోమోను కలర్స్ టీవీ రిలీజ్ చేసిన కాసేపటికే నెటిజన్లు ఉత్సాహంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. అందులో భాగంగా సల్మాన్ ఖాన్‌ను ఉత్తమ హోస్ట్, TRP కింగ్ అంటూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.