బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో తొమ్మిదో వారం నామినేషన్స్ , కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లతో ఎంటర్టైన్మెంట్ డోస్ రెట్టింపు అయింది. ముఖ్యంగా 'ఘోస్ట్ రూమ్' టాస్క్ హౌస్‌మేట్స్‌ను భయంతో వణికించడంతో పాటు, ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ అందించింది. ఈ వారం టాస్క్‌లో భాగంగా, బిగ్ బాస్ హౌస్‌ను దెయ్యాల కొంపలా మార్చేసి, కంటెస్టెంట్లకు ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశాడు.
వణుకు పుట్టించిన 'ఘోస్ట్ రూమ్' టాస్క్
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా ఈ 'ఘోస్ట్ రూమ్' సెట్ చేశారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో లోపలికి వెళ్లిన కంటెస్టెంట్స్ .. చీకట్లో ఉంచిన కొన్ని వస్తువులను తాకి, వాసన చూసి అవి ఏంటో గుర్తించాలి. అయితే ఈ ఘోస్ట్ రూమ్‌లోకి తొలుత వెళ్లిన తనూజ పుట్టస్వామి భయంతో గజగజ వణికిపోయింది. లోపల దెయ్యాల మాస్కుల్లో ఉన్న మనుషులు, వింత శబ్దాలు, ఫ్లాష్ లైట్లు ఆమెను తీవ్రంగా భయపెట్టాయి. టాస్క్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఏడుస్తూ బయటకు వచ్చేసింది. భయంతో వణుకుతూ వచ్చిన తనూజాను సంజన ఓదార్చింది.
ఆడపులి బిల్డప్..
తనూజ తర్వాత రీతూ చౌదరి వంతు వచ్చింది. లోపలికి వెళ్లడానికి ముందు సంజన జాగ్రత్తలు చెప్పగా.. తాను "ఆడపులి" నంటూ రీతూ పెద్ద బిల్డప్ ఇచ్చింది. కానీ లోపలికి అడుగుపెట్టగానే ఆమె ఆట కట్టైంది. దెయ్యాలను చూసి బిగ్గరగా అరుస్తూ, కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా 'నేను బయటకు పోతా, ప్లీజ్, ఇట్లా చేయకండి' అంటూ దీనంగా వేడుకుంది. వీకెండ్‌లో ఎలిమినేషన్ సమయంలో ఆమె చూపించే 'ఫేక్ ఏడుపు' తరహా నటనా ప్రదర్శననే ఇక్కడ కూడా చూపించి ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. చివర్లో మాత్రం, దెయ్యాలనే భయపెట్టేలా ఒక విలన్ నవ్వు నవ్వి, తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది.
సీక్రెట్ టాస్క్.. కొత్త మలుపు
ఇదొక్కటే కాకుండా, బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సుమన్ శెట్టిని హౌస్‌లో మొట్టమొదటి 'రెబెల్' గా ప్రకటించి, అతనికి రహస్య టాస్క్‌ను అప్పగించారు. ఆ తర్వాత దివ్యను కూడా రెబెల్‌గా నియమించారు. రెబెల్స్ అయిన సుమన్, దివ్యలకు సీక్రెట్ టాస్క్‌లు ఇచ్చి, వాటిని పట్టుబడకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. వీరు హౌస్‌మేట్స్‌కు అనుమానం రాకుండా కొన్ని సవాళ్లను పూర్తి చేయాల్సి వచ్చింది. ఒక టాస్క్‌లో పాల ప్యాకెట్‌ను తాగి, మిగతా ప్యాకెట్లను దొంగిలించి స్టోర్ రూమ్‌లో పెట్టడం లాంటివి ఉన్నాయి. ఈ టాస్క్‌లో భాగంగానే దివ్య తెలివిగా వ్యవహరించి, తన సొంత టీమ్ మెంబర్ కళ్యాణ్ ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించింది.
సుమన్, దివ్య ఇద్దరూ తమ రహస్య టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేయడంతో, కెప్టెన్సీ గేమ్‌లో అనూహ్య మలుపు వచ్చింది. ఈ 'సీక్రెట్ స్పై' గేమ్ సీజన్‌కు కావాల్సిన సస్పెన్స్, తెలివిని జోడించింది. మొత్తంగా, ఈ వారం 'ఘోస్ట్ రూమ్' భయాలు, 'రెబెల్స్' సీక్రెట్ టాస్క్‌లతో హౌస్‌మేట్స్ మధ్య భావోద్వేగాల కంటే వ్యూహాత్మక ఆటను ప్రేక్షకులు చూడొచ్చు. మరి ఈ ఆసక్తికరమైన పోరాటంలో చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి!
