పిల్లలు పుట్టరని తెలిసినా.. పెళ్లికి ఒప్పుకున్నారు.. ఎమోషనలైన బిగ్ బాస్ బ్యూటీ

పిల్లలు పుట్టరని తెలిసినా.. పెళ్లికి ఒప్పుకున్నారు.. ఎమోషనలైన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్(Keerthi bhat) ఎమోషనల్ అయ్యారు. ఇటీవలే ఆమెకు కన్నడ నటుడు విజయ్ కార్తిక్(Vijay karthik) తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తనకు కాబోయే భర్త విజయ్ కార్తిక్ తో కలిసి.. ఒక టీవీ షో కు అటెండ్ అయ్యారు. ఈ షోలో కీర్తి, విజయ్ కార్తిక్ మరోసారి దండలు మార్చుకున్నారు. 

ఈ సందర్బంగా కీర్తి మాట్లాడుతూ.. "నీకు నేను తోడుగా, సపోర్ట్ గా ఉంటాను. మీ పేరెంట్స్ ను నా పేరెంట్స్ లా చూసుకుంటాను. నన్ను వదలకుండా ఎప్పటికీ ఇలాగే చూసుకో అంటూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తన అత్తామామల గురించి వివరిస్తూ.. నాకు పిల్లలు పుట్టరని తెలిసినా నన్ను తమ కోడలిగా యాక్సెప్ట్ చేశారు. నువ్వే మాకు పాపవి, కావాలనుకుంటే ఇంకో పాపని దత్తత తీసుకుందాం అన్నారు అని చెప్తూ ఏడ్చేసింది కీర్తి. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.