
రుద్రవీణ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒడిశా మోడల్ శుభ శ్రీ(Subha Sree). యాంకర్, లాయర్, హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్తో రాణిస్తున్న మల్టీ టాలెంటెడ్ శుభ శ్రీ. రీసెంట్గా బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన అందాలతో హౌస్కే అట్రాక్షన్ గా మారింది.
లేటెస్ట్గా శుభ శ్రీ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ని వెల్లడించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్గా వస్తోన్న OG మూవీలో యాక్ట్ చేస్తుందనే విషయాన్ని తనే స్వయంగా తెలిపింది. పవన్ కళ్యాణ్ మూవీలో యాక్ట్ చేయడం ఎంతో ఎనర్జీని ఇచ్చిందని..సెట్లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని..OG మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాని తెలిపి..అందరిని తన వైపు తిరిగేలా ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శుభ శ్రీ కొన్నాళ్ళు లాయర్గా రాణించింది. ఇక మూవీస్ పైన ప్యాషన్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. దీంతో నారా రోహిత్ సోలో మూవీలో సపోర్టింగ్ రోల్లో అవకాశం రాగా, లేటెస్ట్ రుద్రవీణలో హీరోయిన్ గా..అలాగే చివరగా కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిల్ అయింది.
శుభశ్రీ కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించి, ముంబైలోని KV లా కాలేజీలో LLB కోర్సు చేసింది.మిస్ ఇండియా 2020 లో పాల్గొని టైటిల్ సాధించింది.ఇక బిగ్ బాస్ టైటిల్ ని సాధించడానికి హౌస్ లో ట్రై చేస్తుంది.