జబర్దస్త్కి కొత్త యాంకర్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్బాస్ బ్యూటీ

జబర్దస్త్కి కొత్త యాంకర్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్బాస్ బ్యూటీ

తెలుగు బుల్లితెరపై బాగా పాపులర్ అయిన షో ఏదంటే జబర్దస్త్(Jabardasth) అనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా ఈ షో ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తోంది. జెడ్జెస్ మారినా, కంటెస్టెంట్స్ మారినా, యాంకర్ లు మారినా.. ఆ షోకి ఉన్న ఆదరణ మాత్రమున తగ్గడం లేదు. ఇప్పటికీ సూపర్ టీఆర్ఫీతో దూసుకుపోతోంది ఈ షో. 

అనసూయ యాంకర్ గా మొదలైన ఈ షోకి రష్మీ యాడ్ అయ్యింది. చాలా కాలం ఈ ఇద్దరు ఈ షోకి యాంకర్స్ గా కొనసాగారు. ఆతరువాత అనసూయ తప్పుకుంది, ఆమె స్థానాల్లో వార్షిని, విష్ణు ప్రియా, ప్రెజెంట్ సౌమ్య రావుని తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి జబర్దస్త్ యాంకర్ మారారు. కొన్ని అనివార్య కారణాల వల్ల  సౌమ్య జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. 

దీంతో జబర్దస్త్ షోకి కొత్త యాంకర్ గా బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతు(Siri Hanumanthu)ని తీసుకొచ్చారు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సిరి.. ఆ తర్వాత సీరియల్స్, వెబ్ సిరీస్ లు, బిగ్ బాస్.. ఇప్పుడు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగమ్మాయిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిరి.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. దీంతో ఆమె అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.