Bigg Boss Lahari: క్రిస్మస్ వేళ లహరి గ్లామర్ డోస్..అదిరే సూపర్ స్టైలిష్ పిక్స్

Bigg Boss Lahari: క్రిస్మస్ వేళ లహరి గ్లామర్ డోస్..అదిరే సూపర్ స్టైలిష్ పిక్స్

తెలుగు బిగ్బాస్ (Bigg Boss) మాజీ కంటెస్టెంట్ లహరి సోషల్ మీడియాలో హాటు పోజుల ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది..బిగ్బాస్ సీజన్–5 తెలుగులో లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

లేటెస్ట్గా గ్లామర్ డోస్ పెంచుతూ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ను జరుపుకుంది. ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోస్లో లహరి నవ్వులు చిందిస్తూ ఫోజులిచ్చింది. తన ఫ్యాన్స్ కి హ్యాపీ క్రిస్మస్ చెప్పింది.అయితే లహరి ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. ఇక తాజాగా లహరి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేయడంతో..లహరి సూపర్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lahari Shari (@lahari_shari)