ఓటింగ్ టాప్లో రైతు బిడ్డ.. ఆమెకు ఎలిమినేషన్ తప్పదా?

ఓటింగ్ టాప్లో రైతు బిడ్డ.. ఆమెకు ఎలిమినేషన్ తప్పదా?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss season7)లో మొదటి ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. ఈ సీజన్ ఫస్ట్ వీక్ ఫస్ట్ నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అందులో శోభాశెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్, గౌతమ్, షకీలా, దామిని ఉన్నారు. అయితే వీళ్ళలో మొదటివారం ఇంటినుండి బయటకు వెళ్ళేది ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ALSO READ: నేను ఎవడికి వినను.. తలుపుతీస్తే వెళ్లిపోత.. బిగ్ బాస్పై రెచ్చిపోయిన శివాజీ

ఇక నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ను సేవ్ చేయడానికి ఓటింగ్ కూడా మొదలైంది. మొదటి వారం ఓటింగ్ కూడా బాగానే జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. అతను ఓటింగ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. అతని తరువాతి స్థానాల్లో శోభా, రతిక, గౌతమ్, షకీలా, ప్రిన్స్, దామినిలు ఉన్నారు.

ఇక ఈ లిస్టులో చివరి స్థానంలో నిలిచింది కిరణ్ రాథోడ్. దానికి ఆమె భాష సమస్యనే కారణంగా కనిపిస్తోంది. దీని కారణంగా ఆమె హౌస్ లో ఎవరితో సరిగా కలవడం లేదు. ఈ కారణంగానే ఆమెకు ఓటింగ్ సరిగా పడటంలేదు. కనీసం టాస్క్ లలో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా దొరకలేదు ఆమెకు. దీంతో ఆమె ఈ వీక్ ఎలిమినేట్ అవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అలా కాకుండా చివరి నిమిషంలో బిగ్ బాస్ గేమ్ మారిస్తే మాత్రం చెప్పలేం. లాస్ట్ సీజన్ లో కూడా ఇలాగే చివరి నిమిషంలో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు అంటూ చెప్పేశాడు. ఇలా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కిరణ్ రాథోడ్ సేవ్ అయ్యే ఛాన్సెస్ కనబడటంలేదు.