
నటుడు శివాజీ(Shivaji) బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season 7)లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముందునుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నారు శివాజీ. అంతేకాదు తన స్టైల్ ఆఫ్ కామెడీతో అందరినీ ఎంటర్టైన్ కూడా చేస్తున్నాడు. అలాంటి శివాజీ ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నాడు. నేను ఎవడికీ వినను, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, బిగ్ బాస్ తమాషాగా ఉందా? తలుపులు తియ్ నేను వెళ్ళిపోతాను అంటూ బిగ్ బాస్ పై రెచ్చిపోయాడు. శివాజీ ప్రవర్తనకు కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా అవాక్కాయ్యారు.
ALSO READ: ఓటింగ్ టాప్లో రైతు బిడ్డ.. ఆమెకు ఎలిమినేషన్ తప్పదా?
ఇంతకీ ఎం జరిగింది అంటే.. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ నుండి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రమోలో శివాజీ ముందు బిగ్ బాస్ ను కాఫీ పంపించామని కోరారు. కాసేపటికి కోపం తో పక్కనే ఉన్న ప్లేట్ ను విసిరేశాడు. అంతేకాదు ఆవేశంలో బకెట్ ను కూడా తన్నేశాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. దానికి బదులుగా బిగ్ బాస్ శివాజీ బీపీ చెక్ చేయమని మిషన్ పంపించాడు. దానికి కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు శివాజీ.
నేను ఇంత సీరియస్ గా మాట్లాడావుతుంటే మీరు జోక్ చేస్తున్నారేంటి? ఎం తమాషాగా ఉందా? తలుపు తీయండి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను వెళ్ళిపోతా అంటూ బిగ్ బాస్ పై ఫైర్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా హౌస్ మొత్తం హీటెక్కింది. ఈ ప్రోమోతో ఆడియన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది. మరి చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.