గౌతమ్ దెబ్బ అదుర్స్.. శివాజీ, పల్లవి ప్రశాంత్ల మైండ్ బ్లాక్

గౌతమ్ దెబ్బ అదుర్స్.. శివాజీ, పల్లవి ప్రశాంత్ల మైండ్ బ్లాక్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ప్రస్తుతము 12వ వారం ఆట నడుస్తోంది. మంగళవారం నామినేషన్స్ పర్వం పూర్తవడంతో.. ఈ సీజన్ లాస్ట్ కెప్టెన్సీ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ టాస్క్ ప్లాన్ చేశాడు. టాస్క్ లో భాగంగా ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర ఇచ్చి వాళ్ళ మధ్య సీక్రెట్ టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. 

ఇందులో భాగంగా శివాజీకి హంతకుడి పాత్ర ఇచ్చిన బిగ్ బాస్.. ప్రశాంత్ ను చంపే టాస్క్ కూడా ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్ పెంచుకుంటున్న మొక్కను దయచేసి రైతు బిడ్డని చెప్పే టాస్క్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశాడు శివాజీ. అయితే.. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్స్ అయినా అర్జున, అమర్ పసిగట్టాల్సి ఉంటుంది. కానీ వారికన్నా ముందే ఆ రెండు విషయాలను పసిగట్టేశాడు గౌతమ్. 

మర్డర్ అయి దెయ్యంలా తిరుగుతున్న ప్రశాంత్ తో నిన్ను చంపింది శివాజీ అన్ననే కదా అని చెప్పేశాడు. కానీ దానికి ప్రశాంత్ సైలెంట్ గా అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ మర్డరర్ కూడా శివాజీనే అని అందరి ముందే చెప్పేశాడు. ఇలా ఆ రెండు టాస్కులను ముందే పసిగట్టేసి.. తాను స్మార్ట్ అండ్ మాస్టర్ మైండెడ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు గౌతమ్. దేంతో గౌతమ్ కొట్టిన దెబ్బకి శివాజి, పల్లవి ప్రశాంత్ ల మైండ్ బ్లాక్ అయ్యింది.