శ్రీవారికి భారీ విరాళం రూ.2.40 కోట్లు

శ్రీవారికి భారీ విరాళం రూ.2.40 కోట్లు

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. TTDలోని వివిధ ట్రస్టులకు రూ.2.40 కోట్ల విరాళం ఇచ్చాడు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలుసుకున్న ఆ భక్తుడు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశాడు. అయితే తన పేరును మాత్రం బయటపెట్టవద్దని అజ్ఞాత భక్తుడు కోరాడు. ఇటీవల మరికొందరు భక్తులు కూడా భారీ విరాళాలు అందజేశారు.