గయా ప్రాంతంలో గూడ్సు రైలు పట్టాలు తప్పి బోల్తా

గయా ప్రాంతంలో  గూడ్సు రైలు పట్టాలు తప్పి బోల్తా

బీహార్‌లోని గయా ప్రాంతంలో బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 53 వ్యాగన్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం విషయం తెలుసుకున్న అధికారులు మరమ్మతులు చేపట్టారు.

అయితే మొత్తం 59 వ్యాగన్లు ఉండగా అందులో 53 చెల్లాచెదురుగా పడ్డట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనట్టు సమాచారం. అనంతరం రైల్వే సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. బ్రేక్‌ విఫలమవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సిబ్బంది గుర్తించారు.