బీహర్ లో మా ఆధిక్యం తగ్గడానికి కోవిడే కారణం

బీహర్ లో మా ఆధిక్యం తగ్గడానికి  కోవిడే కారణం

బీహార్ లో  జేడీయూకు ఆధిక్యం తగ్గడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి  స్పందించారు. తాము ఓడిపోవడానికి   కోవిడే కారణం కానీ  తేజస్వీ యాదవ్ కాదన్నారు.  ఈ ఏడాదిలో ఆర్జేడీ బ్రాండ్ పెరగలేదని..నితీశ్ బ్రాండ్ తగ్గలేదన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజల తీర్పును స్వాగతిస్తామన్నారు.

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఆర్జేడీ కూటమి,ఎన్డీయే కూటమికి మధ్య స్వల్ప ఆధిక్యం  కొనసాగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్డీయే 81, మహాకూటమి 75 ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహా కూటమి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ లో ముందంజలో ఉన్నారు. హాసన్ పూర్ లో  తేజ్ ప్రతాప్ యాదవ్ ముందంజలో ఉన్నారు.