ఢిల్లీలో బీహార్ జ్యోతిష్యుడు అరెస్ట్: ఇతను చేసిన పని తెలిస్తే.. ఎవరికైనా ఒళ్లు మండటం ఖాయం !

ఢిల్లీలో బీహార్ జ్యోతిష్యుడు అరెస్ట్: ఇతను చేసిన పని తెలిస్తే.. ఎవరికైనా ఒళ్లు మండటం ఖాయం !

పాట్నా: మానవ బాంబులు ప్రవేశించాయంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు మెసేజ్ పంపిన వ్యక్తిని పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు. తన స్నేహితుడిపై కోపంతో అతడిని కేసులో ఇరికించేందుకు ఈ కుట్ర చేసినట్లు గుర్తించారు. వృత్తి రీత్యా జోతిష్యుడైన బీహార్లోని పాటలీపుత్రకు చెందిన అశ్వినీ కుమార్ (51) గత ఐదేండ్లుగా నోయిడాలో నివాసం ఉంటున్నాడు. పాట్నాలోని పుల్వారీ షరీఫలో ఫిరోజ్ అనే తన మిత్రుడు పెట్టిన కేసులో అశ్వినీకుమార్ అరెస్ట్ అయి మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. అందుకు ప్రతీకారంగా ఫిరోజ్ను కేసులో ఇరికించేందుకు అతడి పేరుతో ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపాడు.

34 మానవ బాంబులతో పాటు 400 కిలోల ఆర్డీఎక్స్ ఉన్నట్లు, 14 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడినట్లు పేర్కొన్నాడు. గణేష్ నిమజ్జనానికి ఒక రోజు ముందు ఈ బెదిరింపు మెసేజ్ రావడంతో అలర్ట్ అయిన పోలీసులు విస్తృత తనిఖీలు చేయడంతో పాటు అతడిని నోయిడాలో అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించారు. నిందితుడి నుంచి 7 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 6 మెమోరీ కార్డ్ హోల్డర్లు, ఒక సిమ్ స్లాట్ ఎక్స్టర్నల్, 2 డిజిటల్ కార్డులు, 4 సిమ్ కార్డ్ హోల్డర్లు స్వాధీనం చేసుకున్నారు.

►ALSO READ | హనీమూన్ మర్డర్ కేసు: సోనమ్‌ను నిందితురాలుగా తేల్చిన సిట్.. 790 పేజీల ఛార్జ్ షీట్..