జర్నలిస్టు విమల్ హత్య కేసు నిందితులను వదిలిపెట్టం : సీఎం నితీష్​ 

జర్నలిస్టు విమల్ హత్య కేసు నిందితులను వదిలిపెట్టం : సీఎం నితీష్​ 

బీహార్లో జర్నలిస్టు విమల్కుమార్ యాదవ్ను కాల్చి చంపిన ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది. విమల్పై నలుగురు దుండగులు ఆయన నివాసంలోనే కాల్పులు జరిపారు. ఈ ఘటనపై  స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నేరస్తులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్న క్రమంలో బీహార్​ముఖ్యమంత్రి నితీష్​కుమార్​స్పందించారు. త్వరితగతిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హత్య తనను తీవ్రంగా బాధించిందన్నారు. హత్యపై దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. 

శుక్రవారం (ఆగస్టు 18న) ఉదయం అరారియా జిల్లాలో విమల్ను నలుగురు దుండగులు ఆయన నివాసంలోనే కాల్పులు జరపడంతో గాయాలపాలయ్యారు. వెంటనే రాణిగంజ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించి ఆయన చనిపోయారు.

జర్నలిస్టు విమల్ కుమార్ మర్డర్​ స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. విమల్ కొన్నేళ్లుగా దైనిక్ జాగరణ్ వార్తా పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. చనిపోయిన జర్నలిస్టు సోదరుడిని కూడా కొన్నేళ్ల క్రితం ఇదే తరహాలో కాల్చి చంపినట్లు సమాచారం. 

జర్నలిస్టు విమల్ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ప్రతిపక్ష బీజేపీ నేర సంఘటనలను బీహార్‌లో జంగల్ రాజ్గా అభివర్ణించింది.