బీహార్ ఎగ్జిట్ పోల్స్లో కొత్త ట్విస్ట్.. అధికారం NDA దే.. కానీ సీఎం అభ్యర్థి మాత్రం..

బీహార్ ఎగ్జిట్ పోల్స్లో కొత్త ట్విస్ట్.. అధికారం NDA దే.. కానీ సీఎం అభ్యర్థి మాత్రం..

దేశం అంతా ఇప్పుడు బీహార్ ఎగ్జిట్ పోల్స్ పైనే చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా సర్వే రిజల్స్ట్ వచ్చాయని కొందరు.. ఎన్డీయే గెలుపు పక్కా అని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ సర్వే సంస్థలు, న్యూస్ ఛానెల్స్ అన్నీ బీజేపీ-జేడీయూ కూటమి ఎన్డీఏ కే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్డీఏకు  కనీసం 140 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 

అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్-ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాగట్బంధన్ కూటమి మళ్లీ ఈసారి కూడా అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వెల్లడించాయి. 2020లో గెలుపుకు దగ్గరకు వచ్చినట్లే వచ్చి ఓడిన ఈ కూటమి.. ఈసారి పక్కాగా గెలుస్తామనే ధీమాలో ఉంది. 

అధికారం ఎన్డీఏది.. సీఎం ఎవరంటే..

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. రాష్ట్ర ప్రజలు అధికారాన్ని మళ్లీ ఎన్డీఏకు కట్టబెట్టేందుకు సుముఖత చూపారు. నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు. కానీ సీఎం ఎవరంటే తేజస్వీ యాదవ్ వైపు మొగ్గు చూపడం సర్ప్రైజింగ్ థింగ్. 

పీపుల్స్ పల్స్ (Peoples Pulse),  ఆక్సిస్ మై ఇండియా (Axis My India) సంస్థలు వెల్లడించిన ఫలితాల్లో.. సీఎం క్యాండేట్ గా తేజస్వీకే జనాలు జై కొట్టినట్లు పేర్కొంది. 

ఆక్సిస్ మై ఇండియా ప్రకారం.. ఎన్డీఏ కు 121 నుంచి 141 సీట్లు వస్తాయని ప్రెడిక్ట్ చేసింది. అదే సమయంలో మహాగట్బంధన్ కు 98 నుంచి 118 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ.. సీఎం క్యాండేట్ గా తేజస్వీ యాదవ్ కు 34 శాతం ప్రజలు ఓటేశారు. అదే సమయంలో నితీష్ కుమార్ కేవలం 22 శాతం మాత్రమే సీఎం అభ్యర్థిగా ఓటర్లు భావిస్తున్నారు. 

►ALSO READ | ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఉగ్రవాదుల చర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం.. కేబినెట్ నిర్ణయాలు ఇవే !

మరో సంస్థ పీపుల్స్ పల్స్ సర్వేలో 133-159 సీట్లతో ఎన్డీఏ అధికారం చేపడుతుందని.. కాంగ్రెస్ కూటమి 75-101 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని వెల్లడించింది. అదే సమయంలో సీఎంగా తేజస్వీ యాదవ్ పర్ఫెక్ట్ అని 32 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ 30 శాతం మంది మాత్రమే విశ్వసిస్తున్నారు. 

2025 నవంబర్ 11 న బీహార్ అసెంబ్లీ తుది దశ పోలింగ్ పూర్తైన విషయం తెలిసిందే. మొత్తం 243 సీట్లకు జరిగిన ఓటింగ్ లో ఆ రాష్ట్ర చరిత్రలోనే 1951 తర్వాత అత్యధికంగా 66.91 శాతం పోలింగ్ నమోదైంది.